Netizens angry on pm modi over lpg and petrol price hike
#Petrol
#LpgPriceHike
#Bjp
#PmModi
దేశవ్యాప్తంగా ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు మండిపోతోన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు చాలా రాష్ట్రాల్లో వంద రూపాయల మార్క్‌ను దాటాయి. వంటనూనెల రేట్లు రెట్టింపు అయ్యాయి. ఇదివరకు 70-80 రూపాయలకు లభించే వంటనూనెల కనీస ధర ప్రస్తుతం 120 రూపాయలు పలుకుతోంది. దీని రేటు 180 రూపాయల వరకు ఉంటోంది. ఈ పరిస్థితుల్లో మళ్లీ వంటగ్యాస్ రేటును పెంచేశాయి చమురు సంస్థలు. ఒక్కో సిలిండర్ మీద కొత్తగా 25 రూపాయలను పెంచాయి. పెంచిన ధర అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది.